IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరగనుంది. భారత జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. నిజానికి సిరీస్‌లో నిలదొక్కుకోవాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే.

Published By: HashtagU Telugu Desk
Ind Vs NZ

Resizeimagesize (1280 X 720) (2) 11zon

భారత్, న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య రెండో టీ20 నేడు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో జరగనుంది. భారత జట్టుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. నిజానికి సిరీస్‌లో నిలదొక్కుకోవాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే. అదే సమయంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌ బరిలోకి దిగుతుంది.

మొదటి టీ20లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. తొలి టీ20లో విజయంతో కివీస్ పట్టుదలతో ఉండగా, భారత జట్టుపై ఒత్తిడి ఉంది. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. రాంచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లుగా భారత గడ్డపై విజిటింగ్ టీమ్ టీ20 సిరీస్ గెలవలేకపోయింది. భారత గడ్డపై కివీ జట్టు 2012లో చివరిసారిగా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Sports Minister Of Pakistan: పాక్ సీనియర్ క్రికెటర్‌కు మంత్రి పదవి

లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ ప్రతిసారీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తుంది. ఈ విజయాలన్నీ కొంత ఏకపక్షంగానే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ వికెట్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు మరింత సహాయం అందుతున్నట్లు స్పష్టమైంది. లక్నోలో జరిగే మ్యాచ్‌లో ఉష్ణోగ్రత 13 నుంచి 15 డిగ్రీల మధ్య ఉంటుంది. మ్యాచ్ జరిగే రోజు వర్షం కురిసే అవకాశం లేదు. అంటే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తవుతుంది.

భారత జట్టు లక్నోలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. రెండు సార్లు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 190+ పరుగులు చేసింది. భారత్ ఇక్కడ శ్రీలంక, వెస్టిండీస్‌లను ఓడించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ రాంచీ వేదికగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ డెవాన్ కాన్వే (52), డారిల్ మిచెల్ (59) అర్ధ సెంచరీలతో 176 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్‌కు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ సిరీస్‌లో కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.

  Last Updated: 29 Jan 2023, 08:36 AM IST