Site icon HashtagU Telugu

world cup 2023: భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్..ర‌చిన్ ర‌వీంద్ర హాఫ్ సెంచరీ

World Cup 2023 (45)

World Cup 2023 (45)

world cup 2023: ధర్మశాల వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తన ప్లేయింగ్ 11లో రెండు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీలు చోటు దక్కించుకున్నారు. కాగా న్యూజిలాండ్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఆరంభం నుంచి టీమిండియా బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేస్తున్నారు. నాలుగో ఓవర్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన మూడో బంతికి న్యూజిలాండ్ మొదటి వికెట్ ను కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో ఓపెనర్ డేవన్ కాన్వే డకౌట్ తో పెవిలియన్ చేరాడు. కాన్వే శ్రేయస్ అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఈ క్రమంలో కివీస్ కేవలం తొమ్మిది పరుగులు చేసి వికెట్ నష్టపోయింది.భారత బౌలర్లు అదే జోరుతో బౌలింగ్ చేస్తుండటంతో రెండు వికెట్ల న‌ష్టానికి 61 ప‌రుగులు చేసింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో విల్ యంగ్ (17; 27 బంతుల్లో 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 8.1వ ఓవ‌ర్‌లో 19 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. మరోవైపు భారత్ పై కివీస్ బ్యాట్స్ మెన్ ర‌చిన్ ర‌వీంద్ర 56 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

Also Read: Ganesh Temple : ఉత్తరాల గణపయ్య.. ఈ ఆలయం గురించి తెలుసా ?