IND vs NZ: రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్ గా పాండ్యా..!

ఈ నెల 18 నుంచి భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

  • Written By:
  • Updated On - November 17, 2022 / 11:05 AM IST

ఈ నెల 18 నుంచి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్లు లేకుండానే భారత జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. భారత టీ20 జట్టుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శన నిరాశపర్చినా..తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగుతామని పాండ్యా వెల్లడించాడు.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముందుగా ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్, తర్వాత వన్డే సిరీస్ జరగనుంది. ICC T20 వరల్డ్ కప్ 2022 తర్వాత ఇరు జట్ల మధ్య ఈ సిరీస్ జరుగుతోంది. T20 సిరీస్‌లో నవంబర్ 18, 20,22 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 మ్యాచ్ లకు హార్దిక్ పాండ్యా భారత్‌ టీంకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

భారత్ vs న్యూజిలాండ్ వన్డే సిరీస్ గురించి మాట్లాడుకుంటే.. మొదటి వన్డే నవంబర్ 25న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరగనుంది. 2వ వన్డే నవంబర్ 27న హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో జరగనుండగా, 3వ వన్డే నవంబర్ 30న క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరగనుంది. వన్డే సిరీస్‌లో భారత్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది నవంబర్ లో భారత్, న్యూజిలాండ్ చివరిసారిగా T20 సిరీస్ ఆడాయి. ఆ సిరీస్ సమయంలో న్యూజిలాండ్ మూడు T20ల కోసం భారత్ లో పర్యటించింది. ఆ సిరీస్ లో న్యూజిలాండ్ మూడు T20 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ODI, T20 సిరీస్‌లకు టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. శిఖర్ ధావన్ వన్డే జట్టుకు సారథ్యం వహిస్తుండగా, హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్‌లో టీ20లు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్నాయి. మూడు ODI మ్యాచ్‌లు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి.

భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (C), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్.

భారత వన్డే జట్టు: శిఖర్ ధావన్ (C), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్.