India vs New Zealand: బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ (India vs New Zealand) జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో 4 రోజులు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి చూపు ఐదో రోజుపైనే ఉంది. ఈ టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 462 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల విజయ లక్ష్యం ఉంది. 5వ రోజు ఈ స్కోరును న్యూజిలాండ్ సులభంగా సాధించే అవకాశం ఉంది. అయితే గత గణంకాలు చూస్తే టీమిండియా అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
టీమిండియా 107 పరుగుల టార్గెట్‌ని డిఫెండ్ చేసుకుంటుందా లేదా మ్యాచ్‌ను కివీస్‌కు అప్పగించేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత్ ఓసారి ఈ టార్గెట్‌ని డిఫెండ్ చేసుకుందని రికార్డులు చెబుతున్నాయి. 2004లో వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో భారత్ 107 టార్గెట్‌ని కాపాడుకుంది. ఆ టెస్ట్‌లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో భారత్.. ఆసీస్‌ని 93 పరుగులకే కట్టడి చేసింది.
Also Read: Bibinagar Aiims : రాసలీలలకు నిలయంగా మారిన బీబీనగర్ ఎయిమ్స్
న్యూజిలాండ్ జట్టుకు వర్షం అడ్డంకి మారవచ్చు
బెంగళూరు టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు చాలా కష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ను టీమిండియా కాపాడుకునే అవకాశం ఉంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఐదో రోజు వర్షం కురిసే అవకాశం ఉంది. Accuweather నివేదిక ప్రకారం.. రేపు (అక్టోబర్ 20) బెంగళూరులో 80 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు రోజంతా వర్షం పడితే ఈ మ్యాచ్ డ్రా అవుతుంది.
అక్యూవెదర్ ప్రకారం.. బెంగళూరులో ఉదయం 9 నుండి 10 గంటల మధ్య వర్షం పడే అవకాశం 51% ఉంది. ఇది కాకుండా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 45 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు 49% వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు 51%, మధ్యాహ్నం 3 గంటలకు 55% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీ చేశాడు
రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులు చేసింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్‌పై సర్ఫరాజ్ ఖాన్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. 150 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 18 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతడితో పాటు రిషబ్ పంత్ 105 బంతుల్లో 99 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. 1 పరుగు తేడాతో పంత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.