Site icon HashtagU Telugu

Manchester Test: భార‌త్‌- ఇంగ్లాండ్ నాల్గ‌వ టెస్ట్ డ్రా.. శ‌త‌క్కొట్టిన టీమిండియా ఆటగాళ్లు!

Manchester Test

Manchester Test

Manchester Test: ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన పోరాటం చేసి మ్యాచ్‌ను డ్రా చేయగలిగింది. 311 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ సాధించినప్పటికీ.. టీమిండియా పట్టుదలతో ఆడి మ్యాచ్‌ను డ్రాగా (Manchester Test) ముగించింది. ఐదవ రోజు ఆటలో ముగ్గురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించడం విశేషం.

సెంచరీలతో కదం తొక్కిన భారత బ్యాట్స్‌మెన్‌లు

భారత్ తమ రెండవ ఇన్నింగ్స్‌లో మొత్తం 425 పరుగులు సాధించింది. ఇందులో ముఖ్యంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలు సాధించి జట్టును ఆదుకున్నారు.

Also Read: Monsoon Health Tips: వ‌ర్షంలో త‌డిస్తే జ‌లుబు, జ్వ‌ర‌మే కాదు.. ఈ ఇన్ఫెక్ష‌న్లు కూడా వ‌స్తాయ‌ట‌!

మాంచెస్టర్‌లో కొనసాగిన సంప్రదాయం

మాంచెస్టర్‌లో భారత జట్టు ఇప్పటివరకు ఏ టెస్ట్ మ్యాచ్‌ను గెలవలేదనే సంప్రదాయం ఈ డ్రాతో కొనసాగింది. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో టీమిండియాకు ఇది ఆరవ డ్రా కాగా.. గతంలో ఈ మైదానంలో 4 ఓటములను కూడా చవిచూసింది.

మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 669 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు చూపిన పట్టుదల, ముఖ్యంగా సెంచరీలు సాధించిన ముగ్గురు ఆటగాళ్ల పోరాటం మ్యాచ్‌ను డ్రా దిశగా నడిపించింది. ఈ డ్రా భారత జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై ఇంత పెద్ద ఆధిక్యాన్ని ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడుకోవడం ఒక గొప్ప విజయం లాంటిది.

రాహుల్-గిల్ డ్రాకు పునాది వేశారు

భారత్ ముందు 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని అధిగమించే పెద్ద లక్ష్యం ఉంది. స్కోరు 0 వద్ద రెండు వికెట్లు పడిపోయాయి. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. నాల్గవ రోజు మూడవ సెషన్ పూర్తిగా టీమ్ ఇండియా వైపు మ‌ళ్లింది. ఎందుకంటే గిల్, రాహుల్ తమ వికెట్లను కాపాడుకోవడమే కాకుండా స్కోర్‌బోర్డ్‌ను కూడా ముందుకు తీసుకెళ్లారు. ఐదవ రోజు వచ్చినప్పుడు కేఎల్ రాహుల్ 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కెప్టెన్ గిల్ ముందుకు సాగి సిరీస్‌లో తన నాల్గవ సెంచరీని సాధించాడు. కానీ సెంచరీ సాధించిన కొద్దిసేపటికే 103 పరుగులతో ఔట్ అయ్యాడు. రాహుల్- గిల్ 188 పరుగుల భాగస్వామ్యంతో టీమ్ ఇండియా డ్రాకు పునాది వేశారు. ఇక త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన జ‌డేజా, సుంద‌ర్ చాలా ఓపిక‌తో ఆడుతూ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ధీటుగా ఎదుర్కొన్ని ఈ ఇద్ద‌రూ సెంచ‌రీల‌తో టీమిండియాను కాపాడారు.