India vs England: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌లో పునరాగమనం చేసింది. ఇంగ్లండ్‌కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇందులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ విజయంతో ప్రస్తుతం సిరీస్ 2-1గా మారింది. మూడో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read: Bangladesh Army : బంగ్లాదేశ్‌లో మరో తిరుగుబాటుకు రంగం సిద్ధం..?
ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ అర్ధశతకం సాధించాడు. లియామ్ లివింగ్‌స్టన్ 43, జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జామీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ చెరో 2 వికెట్లు తీశారు. మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను ఇంగ్లండ్ కాపాడుకుంది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణెలో జరగనుంది.
సూర్యకుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్‌లోనూ నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టీ20ల్లో నిరాశపర్చిన సూర్య మూడో మ్యాచ్‌లోనూ అదే బ్యాడ్ ఫామ్ కొనసాగించాడు. సూర్య 7 బంతుల్లో 14 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాడు. ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ బ్యాట్ నుంచి ఇప్పటి వరకు 26 పరుగులు మాత్రమే నమోదయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టగా, రెండో మ్యాచ్‌లో 7 పరుగులకే అవుట్ అయ్యాడు. 2024 టీ20 ప్రపంచకప్ నుంచి సూర్య టీ20ల్లో రాణించలేకపోతున్నాడు.