Site icon HashtagU Telugu

India vs England: ఓవల్ టెస్ట్ మూడవ రోజు ఆట టైమింగ్‌లో మార్పు.. వివ‌రాలీవే!

India- England Series

India- England Series

India vs England: భార‌త్‌, ఇంగ్లాండ్ (India vs England) మధ్య ఓవల్‌లో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా మొదటి, రెండవ రోజు ఆటలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా మూడవ రోజు ఆట‌ టైమింగ్‌లో స్వల్ప మార్పులు చేశారు.

మూడవ రోజు ఆట టైమింగ్స్ (భారత కాలమానం ప్రకారం)

వర్షం వల్ల కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి మూడవ రోజు ఆటను అరగంట ముందుగా ప్రారంభించనున్నారు. ఈ రోజు మొత్తం 98 ఓవర్లు వేయడానికి ప్రయత్నించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే మొదటి సెషన్ భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత రెండవ, మూడవ సెషన్‌లలో 15-15 నిమిషాలు అదనంగా పెంచ‌నున్నారు.

Also Read: KL Rahul- Umpire Clash: కేఎల్ రాహుల్, అంపైర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైర‌ల్‌!

కోల్పోయిన ఓవర్లను పూర్తి చేయడానికి అవసరమైతే, అదనంగా అరగంట ఆట సమయం పెంచే అవకాశం ఉంది.

భారత్ బ్యాటింగ్‌పై ఒత్తిడి

ఐదవ టెస్ట్‌లో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 247 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 23 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండవ ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేసి కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ వికెట్లు కోల్పోయింది.

ప్రస్తుతం క్రీజులో ఉన్న యశస్వీ జైస్వాల్ అద్భుతమైన అర్ధశతకంతో ఉన్నాడు. మూడవ రోజు ఆటలో భారత్ బ్యాటింగ్ లైనప్ ఇంగ్లాండ్‌కు ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్ధేశించాల్సిన అవసరం ఉంది. ఓవల్ పిచ్‌పై 250 నుంచి 300 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్‌ను కట్టడి చేయడానికి సరిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. మూడవ రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ ఎలా రాణిస్తారో చూడాలి.