India vs England 5th T20I: నేడు ఇంగ్లండ్‌తో టీమిండియా చివ‌రి టీ20.. ప్ర‌యోగాల‌కు సిద్ధ‌మైన భార‌త్‌?

ప్ర‌స్తుతం భార‌త్‌ జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచ‌న చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
IND vs SA T20 Series

IND vs SA T20 Series

India vs England 5th T20I: వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ (IND Vs ENG) చివరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో (India vs England 5th T20I) టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసే అవ‌కాశం ఉంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ కార‌ణంగా ఐదో మ్యాచ్‌లో కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. సంజూ శాంసన్‌కు కూడా ప్లేయింగ్ 11లో అవకాశం ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ష‌మీ జ‌ట్టులోకి వ‌చ్చే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ఇంగ్లండ్‌తో చివ‌రి మ్యాచ్‌కు భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం.

హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌లకు విశ్రాంతి?

ప్ర‌స్తుతం భార‌త్‌ జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచ‌న చేస్తోంది. హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి రావచ్చు. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన‌ వరుణ్ చక్రవర్తి చివ‌రి మ్యాచ్‌లో కూడా ఆడనున్న‌ట్లు నివేదిక‌లు వ‌స్తున్నాయి.

Also Read: New Income Tax Slabs: రూ. 12 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయంపై ఎంత పన్ను ఆదా అవుతుంది?

సంజూ శాంసన్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. దీంతో అతనికి ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోవచ్చు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సంజూపై విశ్వాసం వ్యక్తం చేసి అవ‌కాశం కూడా ఇవ్వొచ్చు. గత మ్యాచ్‌లో శివమ్ దూబేకి ప్రత్యామ్నాయంగా వచ్చిన హర్షిత్ రాణా అద్భుతం చేశాడు. అతను 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ప్లేయింగ్ 11లో చోటు దక్కవచ్చు.

ఐదవ మ్యాచ్‌కి భారత్ జ‌ట్టు (అంచ‌నా)

  • అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
  Last Updated: 02 Feb 2025, 01:17 PM IST