Site icon HashtagU Telugu

India vs England 2nd ODI: టాస్ ఓడిన భార‌త్‌.. జ‌ట్టులోకి కింగ్ కోహ్లీ, ప్ర‌త్యేక రికార్డుపై క‌న్నేసిన గిల్‌!

India vs England 2nd ODI

India vs England 2nd ODI

India vs England 2nd ODI: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India vs England 2nd ODI) మధ్య రెండో మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. కాగా గత మ్యాచ్‌లో ఆడని విరాట్ కోహ్లీ తిరిగి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు మార్పులు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకోవడం ఖాయం కాగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ సిరీస్‌లోకి రావాలని ఇంగ్లండ్ ప్రయత్నిస్తోంది.

కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చే విషయంలో ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. భారత వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కి కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకమైనది. ఇక్కడ అతను ఈ రోజు ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ సాధించ‌ని రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గిల్ 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడితే వన్డే క్రికెట్‌లో 2500 పరుగులు పూర్తి చేస్తాడు.

Also Read: Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి

ఇదే గ‌నుక జ‌రిగితే 50 కంటే తక్కువ వన్డేల్లో 2500 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ఆమ్లా 53 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

భారత్ జ‌ట్టు ఇదే

ఇంగ్లాండ్ జ‌ట్టు ఇదే