Site icon HashtagU Telugu

India vs Bangladesh T20: టీమిండియాకు ధీటుగా బంగ్లాదేశ్ టీ20 జ‌ట్టు..!

India vs Bangladesh T20

India vs Bangladesh T20

India vs Bangladesh T20: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20 (India vs Bangladesh T20) మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ ముందుగా టీమ్‌ ఇండియాను ప్రకటించింది. అదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా నజ్ముల్ హసన్ శాంటో ఎంపికయ్యాడు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు.

మెహదీ హసన్ మిరాజ్ తిరిగి వచ్చారు

భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టులో మెహదీ హసన్ మిరాజ్‌కు చోటు దక్కింది. 14 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతను 2023లో బంగ్లాదేశ్ తరఫున చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. బంగ్లాదేశ్ తరఫున 25 టీ20 మ్యాచ్‌లు ఆడి 248 పరుగులు, 13 వికెట్లు తీశాడు. ఓపెనర్లు పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, రకీబుల్ హసన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

Also Read: Kangana Ranaut Luxury Car: కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసిన హీరోయిన్‌.. ధ‌ర ఎంతో తెలుసా..?

భారత్‌తో టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టు

నజ్ముల్‌ హి స్సేన్ శాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమన్‌, తస్కిన్‌ అహ్మద్, షోరిపుల్ ఇస్లామ్, తంజిమ్‌ హసన్‌ సాకిబ్, రకిబుల్ హసన్.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, సంజు శాంసన్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి.

3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ షెడ్యూల్