Site icon HashtagU Telugu

India Beat Bangladesh: భారత్ విజయంపై కెప్టెన్ రోహిత్ బిగ్ స్టేట్మెంట్

India Beat Bangladesh

India Beat Bangladesh

India Beat Bangladesh: చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేసిన భారత్ 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాగా ఈ మ్యాచ్ విజయంపై రోహిత్ శర్మ (rohit sharma) సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ గెలుపు మాకెంతో అవసరమని చెప్పాడు. అలాగే రాణించిన ఆటగాళ్లను ప్రశంసించాడు.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంగ్లా సిరీస్ కీలకమని చెప్పాడు. సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ (pant)పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో ఇన్నింగ్స్ లో పంత్ చాలా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొన్నాడని కొనియాడాడు. పంత్ ఎదుర్కొన్న తీరు అద్భుతం. అతను ఈ ఫార్మాట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. పంత్ ఎంత సమర్థుడో మాకు తెలుసనని తెలిపాడు. రోహిత్ ఇంకా మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలింగ్ లేదా స్పిన్‌లో కొరత ఉండకూడదని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు మరియు స్పిన్ బౌలర్లకు చాలా సహాయపడిందని చెప్పాడు హిట్ మ్యాన్.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్‌(ashwin)ను ప్రశంసిస్తూ రోహిత్ ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబుతూనే ఉంటాడు. అతను ఈ జట్టు కోసం ఏమి చేస్తున్నాడో చెప్పడానికి నాకు మాటలు లేవు. అతను ఎప్పుడూ మ్యాచ్‌కి దూరంగా లేడు. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత అతను TNPLలో ఆడాడు. అక్కడ అతను టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు, దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని అశ్విన్ పై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇదిలా ఉండగా ఈ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. (IND vs BAN)

భారత బౌలర్ల మ్యాజిక్‌:
భారత గడ్డపై భారత బౌలర్లను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టతరమే. చెన్నై టెస్టు గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల అద్భుత ప్రదర్శన కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు పడకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2, రవీంద్ర జడేజా 5, ఆకాశ్‌దీప్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. చెన్నై టెస్టు మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్లకు భారత బ్యాట్స్ మెన్ క్లాస్ పీకారు. మొదట రిషబ్ పంత్ సెంచరీ చేయగా, ఆపై శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి పంత్ ఔట్ అయ్యాడు. అదే సమయంలో 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులు చేసి శుభ్‌మన్ నాటౌట్‌గా నిలిచాడు.

Also Read: AP Politics : వైఎస్సార్‌సీపీ క్యాడర్ కొత్త టార్గెట్ ధర్మారెడ్డి..?