India vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య గురువారం నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. నెల రోజుల తర్వాత టీమ్ ఇండియా అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నందున భారత అభిమానులు కూడా ఈ సిరీస్‌పై ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను టీమిండియా తేలికగా తీసుకోవడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ తమ చివరి టెస్ట్ సిరీస్‌లో స్వదేశంలో పాకిస్తాన్‌ను ఓడించింది. భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌ను మీరు ఎప్పుడు? ఎక్కడ..? ఎలా ఉచితంగా చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశం vs బంగ్లాదేశ్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఎప్పుడు?
ఇరు జట్ల మధ్య తొలి టెస్టు 19 సెప్టెంబర్ 2024న ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందుగా అంటే ఉదయం 9 గంటలకు జరుగుతుంది.
భారత్ vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ?
ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
Also Read: Greater Warangal : గ్రేటర్ వరంగల్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు
భారత్ vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ మ్యాచ్‌ను ఎక్కడ చూడవచ్చు..?
భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ వయాకామ్ 18 నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడుతుంది. ఇక్కడ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 ఛానల్ 1, ఛానల్ 2లో చూడవచ్చు.
ఇండియా vs బంగ్లాదేశ్ 1వ టెస్ట్ మ్యాచ్‌ని మొబైల్‌లో చూడటం ఎలా..?
ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం Jio సినిమా యాప్, వెబ్‌సైట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
WTC ఫైనల్‌పై భారత్ దృష్టి
భారతదేశం- బంగ్లాదేశ్ జట్లు చివరిసారిగా డిసెంబర్ 2022లో టెస్ట్‌లో తలపడ్డాయి. బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ తమ రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో మరోసారి విజయం సాధించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్‌ను భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. బంగ్లాదేశ్‌తో సిరీస్ తర్వాత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వరుసగా మూడు, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.