Site icon HashtagU Telugu

T20 World Cup: 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

T20 World Cup

T20 World Cup

T20 World Cup: లీగ్ దశలో దుమ్ముదులిపిన టీమిండియా సూపర్8 లోను సత్తా చాటుతుంది. తొలి సూపర్8 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ ని ఓడించిన రోహిత్ సేన, రెండో సూపర్8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ బంగ్లా బ్యాటర్లకు 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ స్కోరుకు హార్దిక్ పాండ్య కారణమయ్యాడు. ఆరంభంలో వరుస వికెట్లతో కష్టాల్లో ఉన్న జట్టును తన అద్భుత ప్రదర్శనతో ఆదుకున్నాడు. రోహిత్ 23 (11), విరాట్ కోహ్లీ 37(28), 6 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ 36 (24), పాండ్యా 27 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేశాడు. పాండ్యకు తోడుగా శివమ్ దూబే అద్భుతంగా రాణించాడు. దూబే 34 పరుగులు చేశాడు.

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 50 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ 2-2 వికెట్లు తీశారు. కాగా హార్దిక్ పాండ్యా తన ఖాతాలో 1 వికెట్ నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే సరిపెట్టుకుంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్ జట్టు: తంజీద్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహీద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, జకీర్ అలీ, రిషాద్ హొస్సేన్, మహేదీ హసన్, తంజీద్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Also Read: AP TDP: రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు