India vs Australia T20: యంగ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమిని చవిచూసిన భారత జట్టు గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. విశాఖపట్నంలో తొలి మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాగా, టాస్ అరగంట ముందుగా సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
India vs Australia

India vs Australia

India vs Australia T20: ఇటీవలే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమిని చవిచూసిన భారత జట్టు గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. విశాఖపట్నంలో తొలి మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాగా, టాస్ అరగంట ముందుగా సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది. భారత్‌ తరుపున సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియాకు బాధ్యతలు చేపట్టనున్నాడు.

టీమిండియా నుంచి యంగ్ స్టార్స్ బరిలోకి దిగుతుంటే ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్ లాంటి సీనియర్స్ ఆసీస్ తరుపున ఆడనున్నారు. ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్ వంటి ప్రపంచ కప్ హీరోల ముందు యంగ్ ఇండియా నిలబడుతుందో లేదో చూడాలి. మరోవైపు ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమ్ పై సత్తా చాటి జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇదే సువర్ణావకాశం. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇక జట్టు కెప్టెన్‌గా, ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌కు ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది.

భారత్ జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రీతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసీద్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

ఆస్ట్రేలియా జట్టు : మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా.

Also Read: Kidney Failure: మూత్రపిండాల వైఫల్యం యొక్క లక్షణాలు

  Last Updated: 23 Nov 2023, 04:08 PM IST