Site icon HashtagU Telugu

IND vs AUS: 109 పరుగులకే టీమిండియా ఆలౌట్.. రాణించిన ఆసీస్‌ స్పిన్నర్లు..!

Australia

Resizeimagesize (1280 X 720) (5) 11zon

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో సత్తా చాటిన టీమిండియా.. మూడో టెస్టులో మాత్రం తడబడింది. ఆసీస్ స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కోహ్లీ (22), గిల్ (21) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కుహ్నెమాన్ ఐదు వికెట్లు పడగొట్టగా.. లియోన్ మూడు, మార్ఫీ ఒక వికెట్ తీశారు.

భారత్ తొలి ఇన్నింగ్స్ 109 పరుగులకే ముగిసింది. ఈరోజు మ్యాచ్ ప్రారంభం నుంచే ఆసీస్ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు తీయగా, చివరి వికెట్ సిరాజ్ (0) రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మిచెల్‌ స్టార్క్‌ వేసిన బంతికి రోహిత్‌ శర్మ వికెట్ ను కాపాడుకోగలిగాడు. దీన్ని సద్వినియోగం చేసుకోలేక తొలి వికెట్‌గా ఔటయ్యాడు. రోహిత్ 12 పరుగులు చేశాడు. ఆ తర్వాత వికెట్ల వర్షం కురిసింది. కేఎల్ రాహుల్ స్థానంలో ఆడుతున్న శుభ్‌మన్ గిల్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను 18 బంతుల్లో 21 పరుగులు చేయగలిగాడు.

Also Read: Employees Strike: సమ్మెలో 5 లక్షల మంది ఉద్యోగులు.. ఎక్కడంటే..?

ఛెతేశ్వర్ పుజారా ఒక్క పరుగుకే ఔట్ కాగా, రవీంద్ర జడేజా నాలుగు పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 52 బంతుల్లో 22 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. 30 బంతుల్లో 17 పరుగులు చేసి శ్రీకర్ భరత్ ఔటయ్యాడు. లంచ్ సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. లంచ్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (3), ఉమేష్ యాదవ్ లను కుహ్నెమన్ అవుట్ చేశాడు. ఉమేష్ 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 17 పరుగులు చేశాడు. సిరాజ్ రనౌట్ కాగా, అక్షర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

లెఫ్టార్మ్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ అరంగేట్రం ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా, లియోన్ కు మూడు వికెట్లు లభించాయి. టాడ్ మర్ఫీకి ఒక వికెట్ దక్కింది. రోహిత్, శుభ్‌మన్, శ్రేయాస్, అశ్విన్, ఉమేష్‌లను కుహ్నెమాన్ అవుట్ చేశాడు. అదే సమయంలో పుజారా, జడేజా, భరత్ లను లియోన్ పెవిలియన్ పంపాడు. కోహ్లీని టాడ్ మర్ఫీ ఔట్ చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది నాలుగో అత్యల్ప స్కోరు. 1983లో వాంఖడేలో ఆస్ట్రేలియాపై భారత్ 104 పరుగులు, 2017లో పూణెలో 105 పరుగులు, 2017లో పుణెలో 107 పరుగులు, ఇప్పుడు 109 పరుగులు చేసింది.

 

Exit mobile version