Site icon HashtagU Telugu

IND VS AUS: నేటి నుంచి భారత్‌, ఆస్ట్రేలియా తొలి టెస్టు

Ind vs Aus

Resizeimagesize (1280 X 720) 11zon

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ను టెస్టు క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్‌గా పరిగణిస్తారు. ఈ రెండు దేశాలు ముఖాముఖిగా ఉన్నప్పుడు క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ లను చూస్తుంటారు. అలాగే టీమిండియా- ఆస్ట్రేలియా (IND VS AUS) జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లు కూడా యాషెస్ కి తక్కువ కాదు. దీని కోసం భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదురుచూస్తూనే ఉంటారు. అలాగే అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడింది.

స్వదేశంలో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్‌ఫైట్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఆసీస్‌తో ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’సిరీస్‌‌ను టీమ్ఇండియా ఆడనుంది. సీనియర్లు, జూనియర్ల కలయికతో రోహిత్‌ సేన బలంగా కనిపిస్తుంటే.. గత మూడు పర్యాయాలు ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్‌ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నేడు నాగ్‌పూర్‌‌లో ఉదయం 9:30గంటలకు తొలిటెస్టు మొదలవనుంది.

Also Read: MS Dhoni: రైతు అవతారం ఎత్తిన కెప్టెన్ కూల్.. ట్రాక్టర్‌ నడిపిన ధోనీ.. వీడియో వైరల్..!

ఫిబ్రవరి 9 (నేటి) నుంచి ఆస్ట్రేలియాతో భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియాతో వరుసగా నాలుగో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. 2014-15లో కంగారూలపై భారత్‌కు చివరి సిరీస్ ఓటమి. ఆ తర్వాత 2017లో సొంతగడ్డపై 2-1తో విజయం సాధించింది. ఆ తర్వాత 2018-19, 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై రెండు సిరీస్‌లను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

నవంబర్ 2017 తర్వాత నాగ్‌పూర్‌లో టీమిండియా తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. 2008 తర్వాత నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో భారత జట్టు తొలిసారి ఆడనుంది. 2008వ సంవత్సర మ్యాచ్ లో 172 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెరీర్‌లో చివరి మ్యాచ్. అదే సిరీస్‌లో అనిల్ కుంబ్లే రిటైరయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) 2023లో ఫైనల్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు ఈ టెస్ట్ సిరీస్ చాలా ముఖ్యమైనది. 4 మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2 మ్యాచ్‌లు గెలిస్తే.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీలో ఫైనల్‌కు చేరుకోగలుగుతుంది.

Exit mobile version