Site icon HashtagU Telugu

India vs Australia: టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బౌలింగ్ చేయనున్న ఆసీస్..!

India vs Australia

Compressjpeg.online 1280x720 Image 11zon

India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయని ఇరు జట్ల కెప్టెన్లు తెలిపారు. భారత్‌తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు భారత ఆటగాళ్లు మైదానంలోకి రానున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. టాస్ ఓడిన రోహిత్ మాట్లాడుతూ.. ఒకవేళ టాస్ గెలిస్తే మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం అని చెప్పాడు.

ఇప్పటికీ ఈ మ్యాచ్ కోసం స్టేడియం వెలుపల వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. చాలా మంది ప్రేక్షకులు స్టేడియం లోపలికి చేరుకున్నారు. అయితే బయట వేల మంది క్యూలో నిలబడి ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికీ ఈ మ్యాచ్ కోసం స్టేడియం వెలుపల వేలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. చాలా మంది ప్రేక్షకులు స్టేడియం లోపలికి చేరుకున్నారు. అయితే బయట వేల మంది క్యూలో నిలబడి ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికి ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ షో నిర్వహించింది.

Also Read: World Cup Final: భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ భద్రత కోసం 6000 మంది సైనికులు..!

భారత ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ (సి), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

We’re now on WhatsApp. Click to Join.