India vs Australia: మెల్‌బోర్న్ టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతుంది. బోర్డర్-గవాస్కర్ (India vs Australia) ట్రోఫీ దక్కాలంటే ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకంగా మారడంతో మ్యాచ్ పై అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇది బాక్సింగ్ టెస్టులోనే అత్యధికమని గత లెక్కలు చెబుతున్నాయి. వివరాలలోకి వెళితే.. మెల్‌బోర్న్ టెస్టులో ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ కాగా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌పై భారత బౌలర్లు ఎటాక్ చేశారు. ఓ దశలో 156 పరుగులకే 8 వికెట్లు కొల్పోగా ఆసీస్ ఆలౌట్ కావడం తధ్యమని భావించారు. అయితే కమిన్స్, నాథన్ లైయన్ రాణించడంతో ఆసీస్ భారీ ఆధిక్యాన్ని భారత్ ముందు ఉంచింది. రేపు 5వ రోజు సిరీస్ ఫలితం తేలనుంది. అయితే నాలుగో రోజు మ్యాచ్‌లో గతంలో ఎన్నడూ లేని రికార్డు నమోదైంది.
మెల్‌బోర్న్ టెస్టుని బాక్సింగ్ డే టెస్టుగా పిలుస్తారు. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ టెస్ట్ చివరి దశకు చేరింది. గతంలో ఆడిన బాక్సింగ్ డే టెస్టులో ఎన్నడూ లేనంతగా ఈ 4 రోజుల్లో ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇలా రికార్డు స్థాయిలో అభిమానులు రావడంతో ఈ బాక్సింగ్ డే టెస్టు చరిత్రాత్మకంగా మారింది. నాలుగో రోజు నాటికి ఈ మ్యాచ్ ని చూసేందుకు 2,99,329 మంది వచ్చారు. 5వ రోజు ఈ సంఖ్య 3 లక్షలు దాటుతుందని అంచనా. టి20 క్రికెట్ ప్రభావం పెరుగుతున్న కాలంలో టెస్ట్ క్రికెట్‌ను చూడటానికి ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం ఈ ఫార్మాట్ కు మునుముందు మంచి భవిష్యత్తు ఉండబోతుద్దని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Boxing Day Test: బాక్సింగ్ డే టెస్టు 5వ రోజు షెడ్యూల్ లో మార్పులు
మెల్‌బోర్న్ టెస్టు ఫలితం ఐదవ రోజు తేలనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అనుకూలంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొత్తం ఆధిక్యం 333 పరుగులు కాగా, మరో వికెట్ మిగిలి ఉంది. 5వ రోజు భారత్ ఓపెనింగ్‌లో 1 వికెట్ కోల్పోతే లక్ష్యం 340 నుంచి 350గా ఉంటుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 474 కాగా ఛేదనలో భారత్ 369 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్లకు 228 పరుగులు చేసింది.