IND All Out: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఐదో, చివరి టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈరోజు మ్యాచ్‌లో తొలిరోజు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతను టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. మిచెల్ మార్ష్ స్థానంలో ఆస్ట్రేలియా బ్యూ వెబ్‌స్టర్‌తో బరిలోకి. ప్రస్తుతం ఈ సిరీస్‌లో కంగారూ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.
Also Read: Pawan Kalyan : సజ్జల ఆక్రమణలపై పవన్ సీరియస్.. చర్యలకు ఆదేశాలు
అయితే ఐదో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు మరోసారి నిరాశపరిచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 185 పరుగులకే ఆలౌట్ (IND All Out) అయింది. భారత్ బ్యాటింగ్ లో సింగిల్ డిజిట్‌కే నలుగురు ఆటగాళ్లు ఔటయ్యారు. ఇందులో నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ కూడా ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. పంత్ తర్వాత రవీంద్ర జడేజా 26, బుమ్రా 22, గిల్ 20, విరాట్ 17 పరుగులతో ఉన్నారు. ఆసీస్ బౌలింగ్‌లో బోలాండ్ 4 వికెట్లు తీయగా.. స్టార్క్ 3, కమిన్స్ 2, లియాన్ 1 వికెట్ తీశారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 ఉత్కంఠ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత 50 ఏళ్లలో ఎవరూ చేయలేని ఘనతను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ సాధించాడు. భారత బ్యాట్స్‌మెన్‌పై ఘోరమైన బౌలింగ్‌తో ఈ బౌలర్ క్రికెట్ చరిత్రలో తన పేరును నమోదు చేసుకున్నాడు. కెరీర్‌లో కేవలం 13వ టెస్టులోనే అందరినీ ఆశ్చర్యపరిచి రికార్డు సృష్టించాడు. 35 ఏళ్ల 267 రోజుల వయసులో ఈ ఫాస్ట్ బౌలర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించాడు.
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)లో తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌లను దెబ్బతీశాడు. తొలి సెషన్‌లో యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లీ (17)లను అవుట్ చేయడం ద్వారా బోలాండ్ టీమ్ ఇండియాకు రెండు పెద్ద షాక్‌లు ఇచ్చాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆస్ట్రేలియాను పటిష్ట స్థితిలో నిలిపింది.
రిషబ్ పంత్, నితీష్ రెడ్డిలను వరుస బంతుల్లో అవుట్ చేయడం ద్వారా బోలాండ్ తన టెస్టు కెరీర్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఇది అతని 13వ టెస్టు మ్యాచ్ మాత్రమే. విశేషమేమిటంటే.. బోలాండ్ 35 ఏళ్ల 267 రోజుల వయసులో 50 టెస్టు వికెట్లు తీసిన అతి పెద్ద ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు 1975లో న్యూజిలాండ్‌కు చెందిన బెవాన్ కాంగ్డన్ (37 ఏళ్ల 10 రోజులు) పేరిట ఉంది.