India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..

గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు.

India vs Australia 3rd T20I: గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఆడుతుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుని, టీమిండియాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ కు దిగారు. 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో బరిలోకి దిగింది. . అదే సమయంలో విజయంతో సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

గౌహతి పిచ్ పై బ్యాటర్స్ ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. ఈ మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. ఈ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరి టీ20లో 400కు పైగా పరుగులు వచ్చాయి. అంటే తిరువనంతపురం తర్వాత గౌహతిలో కూడా అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. ఈ మైదానం ఇప్పటివరకు మొత్తం 6 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 3 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రెండు మ్యాచ్‌ల్లో ఛేజింగ్‌ జట్టు విజయం సాధించింది.

సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బ్యాట్స్‌మెన్‌లు చెలరేగారు. ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ భీకర ఫామ్ కనబరుస్తున్నారు. తొలి మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లలో రింకూ సింగ్ క్రేజీ బ్యాటింగ్‌తో రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. రెండో టీ20లో 344 స్ట్రైక్ రేట్‌తో రింకూ కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు.

Also Read: India vs Australia 3rd T20I: బ్యాటింగ్ కు దిగిన భారత్..