Perth Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు (Perth Test) మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి రోజు 150 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అత్యధికంగా 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టును భారత్ బౌలర్లు కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరో 83 పరుగుల వెనకంజలో ఉంది. తొలిరోజు భారత బౌలర్లు అద్భుతం చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో 67/7 స్కోరు చేసింది. భారత్ తరఫున జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా ఒక వికెట్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగుల వెనుకబడి ఉంది.
Also Read: IPL Auction: ఐపీఎల్ మెగా వేలం.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై భారీ బిడ్‌లు?
బౌలర్లదే హవా
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటిరోజు బౌలర్ల హవాకొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నితీశ్‌రెడ్డి 41, పంత్ 37 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట పూర్తయ్యే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ ఒక వికెట్ తీశారు. ఆసీస్ బ్యాటింగ్ ముగిసే సమయానికి అలెక్స్ క్యారీ (19 నాటౌట్), మిచెల్ స్టార్క్ (6 నాటౌట్) పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 150 పరుగులకే ఆలౌటైంది. నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో జట్టుకు అతిపెద్ద ఇన్నింగ్స్‌గా నిలిచాడు. దీంతో పాటు రిషబ్ పంత్ 36 పరుగులు, కేఎల్ రాహుల్ 26 పరుగులు చేశారు. కాగా జైస్వాల్, పడిక్కల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. విరాట్ కోహ్లి కూడా 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
పెర్త్‌లో బుమ్రా అద్భుతం
జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా డాషింగ్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేసి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు డేల్ స్టెయిన్ మాత్రమే స్మిత్‌ను గోల్డెన్ డక్‌తో ఔట్ చేశాడు. ఇప్పుడు స్మిత్‌ను గోల్డెన్ డక్‌కి ఔట్ చేసిన ప్రపంచంలో రెండో బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. 2014లో స్టెయిన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన బుమ్రా 17 పరుగులతో 4 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.