World Cup 2023: ద్రవిడ్-రోహిత్ మాస్టర్ ప్లాన్

ప్రపంచ కప్ మెగా టోర్నీని ఈ రోజు భారత్ మొదటి మ్యాచ్ తో ప్రారంభించనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఆసీస్ ని దెబ్బతీసేందుకు మెగా అస్త్రాలను సిద్ధం చేసింది.

World Cup 2023: ప్రపంచ కప్ మెగా టోర్నీని ఈ రోజు భారత్ మొదటి మ్యాచ్ తో ప్రారంభించనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఆసీస్ ని దెబ్బతీసేందుకు మెగా అస్త్రాలను సిద్ధం చేసింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కోచ్ ద్రవిడ్ , కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ ని ఎంచుకున్నారు.

ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా ఫైట్‌ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ రోజు చెన్నై వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా ప్రపంచ కప్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నాయి. చెన్నైలో మ్యాచ్ జరుగుతుండటం భారత్ కు కలిసొస్తుంది అంటున్నారు విశ్లేషకులు. చెన్నై పిచ్ స్పిన్​కు అనుకూలిస్తుంది కాబట్టి టీమిండియాలో స్పిన్నర్లను రెడీ చేస్తున్నారు కోచ్ ద్రావిడ్. కంగారూల కోసం కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఆసీస్​ను స్పిన్ ఉచ్చులో చిక్కేలా చేసి చిత్తు చేయాలని వ్యూహం పన్నుతున్నారు. అందుకోసం ఆసీస్ ను దెబ్బతీసేందుకు అశ్విన్ రెడీ అవుతున్నాడు.

అశ్విన్‌ టెస్టుల్లో నంబర్‌ వన్‌ బౌలర్‌. టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించాడు. వన్డేలు ఆడలేదు కదా అని అంత తెలిగ్గా అంచనా వేయలేం. టెస్టుల్లో ముప్పుతిప్పలు పెట్టే అశ్విన్‌ని లైట్ తీసుకునే పరిస్థితిలో ఆస్ట్రేలియా లేదు. పైగా అశ్విన్‌కు చెన్నై హౌం గ్రౌండ్‌ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను వణికించాలంటే అశ్వినే కరెక్ట్ అని జట్టు యాజమాన్యం ఫిక్స్ అయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల  వీక్​నెస్​ను బట్టి ఎలా ఔట్ చేయాలనే దానిపై ద్రవిడ్-రోహిత్ పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. పిచ్ ఏమాత్రం టర్నింగ్​కు అనుకూలించినా ఆసీస్​ను స్పిన్ అటాక్​తో కుప్పకూల్చాలని చూస్తున్నారు. తొలి మ్యాచ్ లో అశ్విన్ ఏ మాత్రం చెలరేగినా ఆసీస్ బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పడతారు. మరి అశ్విన్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించి ద్రవిడ్ రోహిత్ ల నమ్మకాన్ని నిలుపుకుంటాడో లేదో చూడాలి.

Also Read: Teaching Posts : మెడికల్ కాలేజీల్లో జాబ్స్.. నెలకు రూ.2 లక్షల దాకా శాలరీ