ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!

India vs Pakistan  క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఒక ఆసక్తికరమైన ప్రోమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STAR SPORTS PROMO FOR INDIA vs PAKISTAN T20 WORLD CUP…!!! Time to make 8-1 in the […]

Published By: HashtagU Telugu Desk
Star Sports Ind Vs Pak

Star Sports Ind Vs Pak

India vs Pakistan  క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఒక ఆసక్తికరమైన ప్రోమోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ 7-1 ఆధిక్యాన్ని గుర్తుచేస్తూ ఈ ప్రోమోను రూపొందించారు. “మా మధ్య ఉన్న వైరాన్ని తక్కువ అంచనా వేయొద్దు” అని పాకిస్థాన్ అభిమాని అనగా, “మిమ్మల్ని ఎలా తక్కువ అంచనా వేస్తాం? 7-1 రికార్డును 8-1గా మార్చాలి కదా!” అంటూ భారత అభిమాని కౌంటర్ ఇవ్వడం ఈ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. ఈ సంభాషణ ఇరు దేశాల క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా, టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది.

  Last Updated: 29 Jan 2026, 02:47 PM IST