Site icon HashtagU Telugu

India vs Netherlands: నేడు భారత్ తో నెదర్లాండ్స్‌ ఢీ.. సిడ్నీలో వాతావరణ పరిస్థితులేంటి..?

ind vs aus

ind vs aus

పాకిస్థాన్‌తో అత్యంత ఉత్కంఠగా జరిగిన పోరులో విజయం సాధించిన భారత్ నేడు (గురువారం) సిడ్నీలో జరిగే టీ20 ప్రపంచకప్ సూపర్- 12లో తన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా నాలుగు వికెట్లతో విజయాన్ని సాధించింది. తమ T20 ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ ను గెలుపుతో ప్రారంభించిన తర్వాత సెమీ ఫైనల్ రేసుపై భారత్ జట్టు దృష్టి సారించింది.

భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరులో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో గత ఆదివారం జరిగిన పోరులో వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించలేదు. అయితే.. ఈరోజు మ్యాచ్ జరిగే సిడ్నీలో వాతావరణం స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ కు వర్షం ఆటంకం ఉండదని తెలుస్తోంది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో ఏ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వడం లేదని ధృవీకరించారు. పాకిస్తాన్ మ్యాచ్ ముగిసే సమయానికి తిమ్మిరితో బాధపడుతున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడేందుకు బాగానే ఉన్నాడని, ఆడటానికి ఫిట్‌గా ఉన్నాడని కూడా ఆయన పేర్కొన్నాడు.

“మేము ఎవరికీ విశ్రాంతి ఇవ్వబోము. హార్దిక్ అన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాడు. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలని మేము చూడటం లేదు. హార్దిక్ మాకు ముఖ్యమైన ఆటగాడు. అతను బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల ఆటగాడు” అని మాంబ్రే తెలిపాడు.