ICC T20 World Cup 2022: సూపర్ 12 పోరుకు కౌంట్ డౌన్.. భారత్ షెడ్యూల్ ఇదే..!

టీ ట్వంటీ ప్రపంచకప్ లో తొలి అంకానికి తెరపడింది.

Published By: HashtagU Telugu Desk
IND vs BAN INDIA

India Team Virat

టీ ట్వంటీ ప్రపంచకప్ లో తొలి అంకానికి తెరపడింది. క్వాలిఫైయింగ్ టోర్నీలో 8 జట్లు తలపడగా.. నాలుగు జట్లు సూపర్ 12కు అర్హత సాధించాయి. ఎవ్వరూ ఊహించని విధంగా రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ ఇంటిదారి పట్టడం అభిమానులకు షాకే. క్వాలిఫైయింగ్ టోర్నీ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ , జింబాబ్వే, ఐర్లాండ్ సూపర్ 12లో చోటు దక్కించుకున్నాయి.

ఈ మెగా టోర్నీలో సూపర్ 12 ఫైట్ శనివారం నుంచే ఆరంభం కానుంది. సూపర్ 12 తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్-ఏలో న్యూజిలాండ్, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఉండగా.. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, జింబాబ్వే చోటు దక్కించుకున్నాయి. బారత్ , పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండడంతో వీరి మధ్య సూపర్ 12 రెండో మ్యాచ్ నే ఫ్యాన్స్ వీక్షించనున్నారు. ఆదివారం మెల్ బోర్న్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థుల సమరం జరగబోతోంది.

టీమిండియా తొలి మ్యాచ్ లో పాక్ తో తలపడనుండగా.. తర్వాత నెదర్లాండ్స్ , దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ , జింబాబ్వేతో తలపడనుంది. రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు చేరుకోనున్నాయి. టీ ట్వంటీ ఫార్మాట్ కావడంతో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. దీంతో మ్యాచ్ లు హోరాహోరీగా సాగే అవకాశముంది.

సూపర్ 12లో భారత్ షెడ్యూల్

అక్టోబర్ 23 – మ. 1.30 గంటలకు – భారత్ X పాకిస్థాన్ ( మెల్ బోర్న్ )

అక్టోబర్ 27 – మ. 1.30 గంటలకు – భారత్ X నెదర్లాండ్స్ ( సిడ్నీ )

అక్టోబర్ 30 – సా. 4.30 గంటలకు – భారత్ X సౌతాఫ్రికా (పెర్త్ )

నవంబర్ 2 – మ.1.30 గంటలకు – భారత్ X బంగ్లాదేశ్ ( అడిలైడ్ ఓవల్ )

నవంబర్ 6 – మ.1.30 గంటలకు – భారత్ X జింబాబ్వే ( మెల్ బోర్న్ )

  Last Updated: 21 Oct 2022, 09:46 PM IST