U19 Captain Ayush Mhatre : భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ఇటీవల లండన్‌లోని ఐతిహాసిక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే చేసిన వ్యాఖ్యలు ప్రతి యువ క్రికెటర్ కలలను ప్రతిబింబించాయి.
“ఇప్పటికే టీవీలో మాత్రమే చూశాను.. ఇప్పుడు ప్రత్యక్షంగా లార్డ్స్ చూడడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ బరిలోకి దిగే రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను,” అంటూ ఆయుష్ భావోద్వేగంగా చెప్పారు. “ఈ రోజు ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుగా ఇది నిలిచిపోతుంది” అని తెలిపారు.
ఇది మాత్రమే కాకుండా ఆయుష్ తన 18వ పుట్టిన రోజును కూడా లార్డ్స్ వద్ద జరుపుకున్నారు. “లార్డ్స్ వేదికగా నా బర్త్‌డే జరుపుకోవడం ఎంతో గర్వకారణం. ఇదివరకు నా జీవితంలో జరిగిన అతిపెద్ద, ప్రత్యేకమైన సంఘటన ఇదే,” అంటూ ఆయన ఉత్సాహంగా పేర్కొన్నారు.
జట్టు ప్రధాన కోచ్ హృషికేశ్ కాంతికర్ మాట్లాడుతూ, “లార్డ్స్ గ్రౌండ్‌కు వచ్చిన క్షణం నుంచే ఆటగాళ్ల ముఖాల్లో ఆశ్చర్యం, ఆనందం స్పష్టంగా కనిపించాయి. ఇది కేవలం మైదానం కాదు, భారత క్రికెట్ దిగ్గజాల ఘనతకు నిలయమైన స్థలం,” అని వివరించారు.
“నేడు ఆటగాళ్లు మైదానానికి సంబంధించి ఎలాంటి విజయాలు సాధించవచ్చో తెలుసుకుంటారు. భవిష్యత్తులో వీరిలో ఎవరో ఇక్కడే ఆట ఆడే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నమ్మకంగా ఉన్నాను,” అని ఆయన వివరించారు.
ఇక మ్యాచ్‌ల విషయానికి వస్తే, ఇండియా అండర్-19 జట్టు, ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య జరిగిన తొలి యూత్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 20 నుంచి 23 వరకు చెల్మ్‌ఫోర్డ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగనుంది.
Karun Nair: నాలుగో టెస్ట్‌కు కరుణ్ నాయర్ డౌటే.. యంగ్ ప్లేయర్‌కు ఛాన్స్?!