India T20 Team: తొలి టీ ట్వంటీకి భారత్ తుది జట్టు ఇదే

ఐర్లాండ్ తో తొలి ట్వంటీ మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జరగనుంది.

  • Written By:
  • Publish Date - June 26, 2022 / 10:52 AM IST

ఐర్లాండ్ తో తొలి ట్వంటీ మ్యాచ్ ఆదివారం రాత్రి 9 గంటలకు జరగనుంది. హార్దక్ పాండ్య సారథ్యంలోని టీమిండియా ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకోవడం లేదు. అటు వరల్డ్ కప్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ గట్టి పోటీ నెలకొన్న వేళ వచ్చిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకునేందుకు యువ ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. దీంతో తుది జట్టు కూర్పు పైనే అందరి చూపు ఉంది.
సౌతాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఇక్కడా ఉండగా…తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. ఐపీఎల్ అదరగొట్టిన పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కనుంది. యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్ , అర్ష దీప్ సింగ్ లలో ఒకరు తొలి మ్యాచ్ లో అరంగేట్రం చేయనున్నారు.

ఈ మ్యాచ్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఈ యువ ఆటగాళ్లు అరంగేట్రం ఖాయమని అర్థమవుతోంది. అటు బ్యాటింగ్‌పరంగా గత మ్యాచ్‌ ఆడిన తుది జట్టును చూస్తే పంత్, అయ్యర్‌ లేకపోవడంతో రెండు స్పష్టమైన ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుత జట్టు నుంచి రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం చేయకపోగా,సంజూ సామ్సన్‌ మరో చాన్స్‌ కోసం చూస్తున్నాడు.అలాగే సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా కూడా రేసులో ఉన్నారు. ఈ నలుగురిలో ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కనుంది. మరోవైపు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో తొలి సీజన్‌లోనే సూపర్ హిట్ అయిన హార్దిక్ పాండ్యా నేషనల్ టీమ్‌ను ఎలా నడిపిస్తాడన్నది కూడా ఆసక్తిగా మారింది. ఐపీఎల్ మాదిరిగా ఇక్కడా సక్సెస్ అయితే భవిష్యత్తు కెప్టెన్‌గా అతను ముందు వరుసలోకి వస్తాడు.
తుది జట్టును చూసుకుంటే ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. వన్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. అటు నాలుగో స్థానంలో
దీపక్ హుడా, సంజూ శాంసన్ ఒకరికి అవకాశం దక్కనుంది. అయిదో స్థానంలో కెప్టెన్
హార్దిక్ పాండ్యా…తర్వాత దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ కు రానున్నారు. ఇక స్పిన్నర్ గానే కాకుండా బ్యాట్ తొనూ మెరుపులు మెరిపించే అక్షర్ పటేల్ ఏడో స్థానంలో ఆడతాడు. పేస్ విభాగంలో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ లకు చోటు ఖాయం. అయితే మరో పేసర్ గా అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ ల్లో ఒకరికి అవకాశం ఇస్తే ఛాహల్ రెండో స్పిన్నర్ గా ఆడతాడు.