T20 World Cup 2024: ప్ర‌పంచ క‌ప్‌కు ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్‌.. ఎప్పుడంటే..?

భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు.

  • Written By:
  • Updated On - May 15, 2024 / 05:37 PM IST

T20 World Cup 2024: భారత జట్టు ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు. దీని తరువాత టీమిండియా T20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) ఆడవలసి ఉంది. దీని కారణంగా కొంతమంది ఆటగాళ్లు IPL మధ్యలో అమెరికాకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భార‌త్ జ‌ట్టు ఒకే ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని భావిస్తోంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ కప్‌కు ముందు న్యూయార్క్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యోచిస్తోంది.

న్యూయార్క్‌ కాకుండా టీమిండియాకు ఐసీసీ రెండో స్థానం ఇచ్చింది

ప్రపంచకప్‌లో భారత జట్టు తన రెండో మ్యాచ్‌ని న్యూయార్క్‌ స్టేడియంలో పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంది. దీంతో న్యూయార్క్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ పట్టుబట్టింది. నివేదికల ప్రకారం.. ఫ్లోరిడాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని ఐసిసి, వెస్టిండీస్ క్రికెట్.. భార‌త్ జ‌ట్టుకు ప్రతిపాదించాయని స‌మాచారం. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ఐపీఎల్ నుంచి నేరుగా ఫ్లోరిడా వెళ్లేందుకు ఇష్ట‌ప‌డుతుందా అనేది ప్ర‌శ్న‌. భారత్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడడం కూడా ముఖ్యమే. మ‌రీ బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని ఫ్యాన్స్‌తో పాటు ఆట‌గాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు.

Also Read: RCB Vs CSK: ఆర్సీబీ వ‌ర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు..?

ప్రపంచకప్‌కు ముందు భార‌త్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు

ఒకవైపు ఇంగ్లండ్, పాకిస్థాన్ వంటి జట్లు ప్రపంచకప్‌కు ముందు టీ20 సిరీస్‌లు ఆడబోతుండగా, మరోవైపు టీమ్‌ఇండియాకు టీ20 సిరీస్‌లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడడం చాలా ముఖ్యం. ప్రస్తుతం టీం ఇండియా ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లందరూ ప్రపంచకప్‌లోనే క‌నిపించ‌నున్నారు. ఇక టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ గురించి మాట్లాడినట్లయితే నివేదికల ప్రకారం ఈ ప్రాక్టీస్ మ్యాచ్ మే 25 లేదా 26న నిర్వహించనున్న‌ట్లు తెలుస్తోంది.

మే 21న టీమిండియా ఆటగాళ్లు కొందరు ప్రపంచకప్‌కు బయలుదేరుతారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఆ తేదీ వాయిదా పడింది. ముందుగా ఐపీఎల్ ప్లేఆఫ్‌ల నుండి ఎవరి జట్టు నిష్క్రమిస్తుందో ఆ ఆటగాళ్లు వెళ్లిపోతారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ఆడడం ద్వారా టీమిండియా ప్రపంచకప్‌ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్‌లో టీం ఇండియా నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజీ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join