Physical Disabled Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్, పాకిస్థాన్ మరో వేదికపై కూడా తలపడనున్నాయి. దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో (Physical Disabled Champions Trophy) ఈ పోరు కనిపించనుంది. దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకలోని కొలంబోలో 12 జనవరి నుండి 21 జనవరి వరకు నిర్వహించనున్నారు.
దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక మరియు ఇంగ్లండ్ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీకి ముందు భారత జట్టు జైపూర్‌లో శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. ఆ తర్వాత తుది జట్టును ఎంపిక చేస్తారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడం యావత్ దేశానికి గర్వకారణమని వికలాంగుల క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీసీసీఐ) జనరల్ సెక్రటరీ రవి చౌహాన్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆటగాళ్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.
Also Read: Siraj-Bumrah: బెయిల్స్ మార్చిన సిరాజ్.. వికెట్ తీసిన బుమ్రా
దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు అంచనా
ఆల్ రౌండర్లు: రవీంద్ర సంత్, విక్రాంత్ కెన్నీ, ఆకాష్ పాటిల్, సన్నీ గోయత్, నరేంద్ర మంగోర్, జితేంద్ర , మజీద్ మగారే, చింటూ చౌదరి.
వికెట్ కీపర్: యోగేంద్ర బడోరియా, దీపేంద్ర సింగ్
బౌలర్లు: అఖిల్ రెడ్డి (లెగ్ స్పిన్నర్), జస్వంత్ సింగ్ (ఆఫ్ స్పిన్నర్), జయంత్ దే, రాధికా ప్రసాద్, అమీర్ హసన్, జి. ఎస్. శివశంకర్
బ్యాట్స్‌మెన్: కునాల్ ఫనాస్, నిఖిల్ మన్హాస్, రాజు కన్నూర్, సురేంద్ర కోర్వాల్
ఇతరులు: పవన్, మహ్మద్ సాదిక్
దివ్యాంగుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్
12 జనవరి : భారత్ vs పాకిస్తాన్
13 జనవరి: భారత్ vs ఇంగ్లాండ్
15 జనవరి: భారత్ vs శ్రీలంక
16 జనవరి: భారత్ vs పాకిస్తాన్
18 జనవరి: భారత్ vs ఇంగ్లాండ్
19 జనవరి: భారత్ vs శ్రీలంక
21 జనవరి: ఫైనల్