Site icon HashtagU Telugu

Pink Test At SCG: సిడ్నీలో పింక్ టెస్ట్.. కార‌ణం పెద్ద‌దే?

Pink Test At SCG

Pink Test At SCG

Pink Test At SCG: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఐదో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం టీమిండియాకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో జట్టు ఓడిపోతే రోహిత్ బృందం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుండి నిష్క్ర‌మిస్తుంది. ఇప్పుడు సిడ్నీలో ఇరు జట్ల మధ్య పింక్ టెస్టు (Pink Test At SCG) జరగనుంది. ఇప్పుడు చాలా మంది పింక్ టెస్ట్ అంటే ఏంటో తెలియ‌దు. అయితే ఈ టెస్టు వెన‌కు ఓ పెద్ద కార‌ణం ఉంద‌ని ఆసీస్ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించింది.

పింక్ టెస్ట్‌ అంటే ఏమిటి?

నిజానికి సంవత్సరంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌ని పింక్ టెస్ట్ అంటారు. ఇందులో ఆస్ట్రేలియన్ జట్టు పింక్ క్యాప్, పింక్ లోగోతో కూడిన జెర్సీని ధరించి మైదానంలో ఆడటానికి వస్తుంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ దివంగత భార్య జ్ఞాపకార్థం ఈ పింక్ టెస్ట్ ఆడతారు.

నిజానికి 2008లో గ్లెన్ మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు. ఆ తర్వాత గ్లెన్ మెక్‌గ్రాత్ తన భార్య జేన్ మెక్‌గ్రాత్ జ్ఞాపకార్థం ఒక ఫౌండేష‌న్ స్థాపించాడు. ఈ ఫౌండేషన్ బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి పనిచేస్తుంది. వారి కోసం నిధులను కూడా సేకరిస్తుంది. పింక్ టెస్ట్ 2009 సంవత్సరంలో ప్రారంభమైంది.

Also Read: BCCI Meeting With Rohit: రోహిత్‌- గంభీర్‌తో బీసీసీఐ స‌మావేశం.. ఏం జ‌రుగుతుందో?

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే చివరి మ్యాచ్‌ను పింక్‌ టెస్ట్‌గా పిలుస్తారు. వాస్తవానికి ఏ సంవత్సరంలోనైనా మొదటి మ్యాచ్‌ను పింక్ టెస్ట్ అని పిలుస్తారు. దీనిని రెడ్ బాల్‌తో ఆడతారు. పింక్ టెస్ట్ 2009 సంవత్సరంలో ప్రారంభమైంది. పింక్ టెస్ట్ ఉద్దేశ్యం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన, నిధులను సేకరించడం. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మైదానం మొత్తం గులాబీ రంగులోకి మారనుంది. స్టాండ్‌లు, సిబ్బంది, ఆటగాళ్లు జెర్సీపై పింక్ కలర్‌ను చూస్తారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పింక్ క్యాప్ ధరించి కనిపిస్తారు.

సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది

ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. మెల్‌బోర్న్ టెస్టులో విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా కూడా ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలోనూ, టీమ్ ఇండియా మూడో స్థానంలోనూ కొనసాగుతోంది.