Site icon HashtagU Telugu

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..!

Cropped

Cropped

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా- ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫైనల్‌కు చేరుకునేందుకు ఇది కీలక మ్యాచ్ కావడంతో ఏ జట్టు గెలుస్తుందోననే టెన్షన్ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. అయితే టీమిండియా దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ కి అవకాశం ఇచ్చింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఇరుజట్లు సెమీస్‌లో తలపడుతున్నాయి. కాగా బుధవారం జరిగిన సెమీస్‌లో పాకిస్థాన్ గెలుపొంది ఫైనల్‌కు చేరింది.

టీమిండియా బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరు ఓపెనింగ్ లో రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో షమీ, భువి, అర్షదీప్ లు మంచిగా రాణిస్తున్నారు. ఇంగ్లాండ్ విషయానికి వస్తే బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అయితే ఈ జట్టు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడలేకపోతున్నారు. ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ బలహీనంగా ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అడిలైడ్ లో జరగనున్న ఈ రెండో సెమీస్ కు వర్షం ముప్పు లేదు. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దింతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.

Exit mobile version