World Cup India Squad: భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ప్రాథమిక జట్టు (World Cup India Squad)ను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నారు. ఆసియా కప్ 2023 కోసం జట్టును ప్రకటించిన సమయంలో ఈ 18 మంది ఆటగాళ్లలో 15 మందిని ఎంపిక చేస్తామని చీఫ్ సెలక్టర్ స్పష్టం చేశారు.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. టీమ్ ఇండియా అధికారిక ప్రకటనకు ముందే సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్ల పేర్లను ఖరారు చేసింది. ప్రపంచకప్ జట్టు నుంచి తొలగించబడిన ముగ్గురు ఆటగాళ్లలో సంజు శాంసన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆసియా కప్ 2023 కోసం టీమ్ ఇండియాలో భాగం అయ్యారు.
ఆస్ట్రేలియాతో సహా కొన్ని ప్రధాన దేశాలు 2023 వన్డే ప్రపంచ కప్ కోసం తమ 15 మంది సభ్యుల జట్టును ఇప్పటికే ప్రకటించాయి. అదే సమయంలో అందరి చూపు ఇప్పుడు ఆతిథ్య దేశం భారత్‌పైనే ఉంది. దీని తర్వాత అన్ని జట్లకు సెప్టెంబర్ 27 వరకు ఎటువంటి ఆమోదం లేకుండా తమ జట్టులో మార్పులు చేయడానికి అవకాశం లభిస్తుంది. అయితే దీని తర్వాత జట్టులో ఏదైనా మార్పు కోసం ఈవెంట్ టెక్నికల్ కమిటీ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆటగాళ్లకు జట్టులో చోటు..?
వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత్ అంచనా జట్టు గురించి మాట్లాడినట్లయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లను బ్యాట్స్‌మెన్‌గా చేర్చవచ్చు. లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇద్దరు వికెట్ కీపర్లుగా జట్టులోకి రావడం ఖాయం. దీని తర్వాత ఆల్ రౌండర్ ఆటగాళ్లలో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లను చూడవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ భుజాలపై ఉంటుంది. కుల్దీప్ యాదవ్ స్పిన్‌లో స్థానం పొందడం ఖాయం.
ODI ప్రపంచ కప్ 2023 కోసం భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.