న్యూజిలాండ్ తో జరిగిన మూడో టెస్టులో టీం ఇండియా (India vs New Zealand 3rd Test) ఘోర ఓటమి చవిచూసింది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన చివరి టెస్టులో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో 121 పరుగులకు ఆలౌట్ కావడం తో 0-3తో న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది.
న్యూజిలాండ్లో మూడో టెస్టులోనూ భారత జట్టు ఘోరంగా విఫలలైంది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన 25 రన్స్ తేడాతో ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (Rishabh Pant) (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, మ్యాట్ హెన్రీ ఒక్క వికెట్ తీశారు.
Read Also : Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..