వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup)నకు ముందు టీమిండియా కొత్త జెర్సీ (new jersey)ని బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇండియా T20 ప్రపంచ కప్ జట్టు గత వారం ప్రకటించబడింది. భారత జట్టు వారం రోజుల ముందే ఆస్ట్రేలియా చేరుకోవాల్సి ఉంది. అక్టోబర్ 5న ఆస్ట్రేలియాకు వెళుతుంది. “ఐసిసి వార్మప్ గేమ్‌లతో పాటు మాతో గేమ్స్ ఆడబోయే కొన్ని జట్లతో మేము చర్చలు జరుపుతున్నాం. ద్రవిడ్, అతని సహాయక సిబ్బందితో కలిసి మొత్తం T20 ప్రపంచ కప్ జట్టు అక్టోబర్ 5 న ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ” అని బీసీసీఐ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
ఇదిలా ఉంటే, భారత జట్టు మొహాలీలో ఉంది. ఇవాళ T20I ఓపెనర్‌లో ఆస్ట్రేలియాతో తలపడతారు. ఆ జట్టు ఆడనున్న మూడు మ్యాచ్‌ల్లో ఇదే మొదటిది. భారత్ తరఫున రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య టాస్ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022లో ఇండియా పేలవంగా ఆడింది. అయితే సెలక్టర్లు ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌కు దాదాపు అదే జట్టును ఎంచుకున్నారు.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
స్టాండ్‌బై ఆటగాళ్లు మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్