India Squad: ఆస్ట్రేలియాతో భారత జట్టు ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23న విశాఖపట్నంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌కు భారత జట్టు (India Squad)ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా, రితురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. విశాఖపట్నంతో పాటు తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో ఈ సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
పూర్తి షెడ్యూల్ ఇదే
మొదటి మ్యాచ్- 23 నవంబర్, గురువారం, రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
రెండవ మ్యాచ్- 26 నవంబర్, ఆదివారం, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం
మూడో మ్యాచ్- 28 నవంబర్, మంగళవారం, బర్సపరా క్రికెట్ స్టేడియం, గౌహతి
నాల్గవ మ్యాచ్- 01 డిసెంబర్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్‌పూర్
ఐదవ మ్యాచ్- డిసెంబర్ 03, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్.
Also Read: world cup 2023: ఆస్ట్రేలియాకు గిల్ తాత ఛాలెంజ్
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
We’re now on WhatsApp. Click to Join.
భారత్‌తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు
మాథ్యూ వేడ్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, జోష్ ఇంగ్లిస్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా.