Team India: ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టు ఎంపిక ఎప్పుడో తెలుసా?

సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా...ఈ వారంలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ind Vs Australia Imresizer

Ind Vs Australia Imresizer

Team India: ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ లో ఆడుతూ బిజీగా ఉంది. ఇది ముగిసిన తర్వాత స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ కు ముందు మరి సీరీస్ ఆడబోతోంది. సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా…ఈ వారంలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. మెగా టోర్నీకి ముందు ఇదే చివరి ప్రిపరేషన్ కావడంతో ప్రయోగాలు చేసేందుకు సెలక్టర్లు కూడా సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ లో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో సంజూ శాంసన్ కు నిరాశే మిగలనుంది. తెలుగు తేజం తిలక్ వర్మకు కూడా ఆసీస్ తో సీరీస్ కు అవకాశం దక్కకపోవచ్చు. ఎందుకంటే వరల్డ్ కప్ లో ఆడే జట్టుకు చివరి సీరీస్ కావడంతో ప్రిపరేషన్ ఉండాలని బీసీసీఐ , టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తున్నాయి.

అయితే శ్రేయాస్ అయ్యర్ ఫిట్ నెస్ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆసియా కప్ కు ఎంపికైన అయ్యర్ ఫిట్ నెస్ సమస్యలతో బెంచ్ కే పరిమితం అయ్యాడు. అయితే టోర్నీ ఫైనల్ సమయానికి అతను కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కు మొహాలీ , ఇండోర్, రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఆసీస్ తో వన్డే సీరీస్ కు జట్టు అంచనా :

రోహిత్ శర్మ ( కెప్టెన్ ) , హార్ధిక్ పాండ్య ( వైస్ కెప్టెన్) , గిల్ , కోహ్లీ, కే ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్ దీప్ యాదవ్

Also Read: Mahender Reddy: తెలంగాణాలో క్రీడలకు సీఎం పెద్దపీట, భారీగా ప్రోత్సాహకాలు

  Last Updated: 14 Sep 2023, 06:26 PM IST