India- South Africa: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా దక్షిణాఫ్రికా (India- South Africa)తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ దక్షిణాఫ్రికాలో మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌లు 2024 నవంబర్ 08 నుండి 15 వరకు నాలుగు నగరాల్లో డర్బన్, గెకెబెర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతాయి. టీ20 క్రికెట్‌లో టీమ్ ఇండియా ఇటీవలి ప్రదర్శన బాగానే ఉంది. శ్రీలంకపై క్లీన్ స్వీప్ చేసింది. ఇటువంటి పరిస్థితిలో టీమిండియా ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అదే చేయాలని చూస్తోంది. మీరు ఈ సిరీస్‌ని ఎక్కడ చూడవచ్చు? దాని షెడ్యూల్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి!
T20I సిరీస్ 2024 పూర్తి షెడ్యూల్
టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా మొదటి టీ20 మ్యాచ్ నవంబర్ 8వ తేదీన డర్బన్‌లో జరగనుండగా.. రెండో టీ20 మ్యాచ్ గిక్బెర్హాలో జరగనుంది. మూండో టీ20 మ్యాచ్ సెంచూరియన్, నాల్గొవ టీ20 మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత్ కాలమానం ప్రకారం.. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతాయి.
Also Read: Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
ఎప్పుడు, ఎక్కడ ప్లే అవుతుంది?
భారత్-దక్షిణాఫ్రికా మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 09:30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా, రెండో మ్యాచ్ గెకెబర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో జరగనుంది. మూడో, నాలుగో మ్యాచ్‌లు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనున్నాయి.
దక్షిణాఫ్రికా టూర్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్, అవేష్ ఖాన్, యష్ దయాల్.
మీరు సిరీస్‌ని ఇక్కడ చూడవచ్చు
ఈ సిరీస్ అధికారిక ప్రసారం స్పోర్ట్స్ 18లో ఉంటుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ని స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18 HD ఛానెల్‌లలో చూడవచ్చు. అభిమానులు ఈ మ్యాచ్‌ని ఆన్‌లైన్‌లో JioCinemaలో చూడవచ్చు. ఇది కాకుండా మీరు ఈ మ్యాచ్‌ను DD స్పోర్ట్స్‌లో కూడా చూడవచ్చు.