Site icon HashtagU Telugu

Team India @1: అడుగుదూరంలో నెంబర్ 1

Team India

Team India

వన్డే ర్యాంకింగ్స్‌లో (One Day Rankings) అగ్రస్థానం ఇప్పుడు భారత్‌ను (Team India) ఊరిస్తోంది. కివీస్‌పై సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా రేపు జరిగే చివరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. సిరీస్‌ను స్వీప్ చేస్తే ఇంగ్లీష్ టీమ్‌ను వెనక్కి నెడుతుంది భారత్. మిషన్ వరల్డ్‌కప్‌ టార్గెట్‌గా కొత్త ఏడాదిలో వరుస విజయాలతో దూసుకెళుతోంది టీమిండియా. ఇటీవలే శ్రీలంకపై (Srilanka) సిరీస్ గెలిచిన భారత్… తాజాగా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. మేజర్ టోర్నీల్లో భారత్‌కు (Team India) ఎప్పుడూ షాక్‌ ఇస్తున్న కివీస్ గత కొంతకాలంగా వన్డేల్లో నిలకడగా రాణిస్తోంది. దానికి తగ్గట్టే తొలి మ్యాచ్‌లో గట్టిపోటీ ఇచ్చినా… రెండో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవడమే కాదు వన్డేల్లో అగ్రస్థానానికి అడుగుదూరంలో నిలిచింది.

ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డేలోనూ న్యూజిలాండ్‌ను నిలువరించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్  (Team India) 113 పాయింట్లతో సమంగా ఉన్నప్పటకీ… రేటింగ్ పాయింట్స్‌లో కొద్దిపాటి తేడాతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మూడో వన్డేలో కివీస్‌పై భారత్ గెలిస్తే ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి రోహిత్‌సేన అగ్రస్థానం (Top Place) చేజిక్కించుకుంటుంది.

ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే చివరి మ్యాచ్‌లోనూ టీమిండియానే ఫేవరెట్‌. తొలి వన్డేలో బ్యాటర్లు రాణిస్తే… రెండో వన్డేలో బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో మూడో వన్డేలో ఇదే జోరు కొనసాగిస్తే సిరీస్ క్లీన్‌స్వీప్‌తో పాటు వన్డేల్లో (One day) టాప్ ప్లేస్ అందినట్టే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న భారత్‌కు…అటు టెస్టుల్లోనూ అగ్రస్థానం ఊరిస్తోంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ను గెలిస్తే టాప్ ప్లేస్‌కు దూసుకెళుతుంది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ నెంబర్‌ వన్‌గా (Number) నిలిచిన జట్టుగా ఘనత సాధించే అవకాశముంది.

Also Read: Shahrukh and Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి షారూఖ్ ఖాన్ కండీషన్‌.. ఎందుకో తెలుసా!

Exit mobile version