IND VS ENG 2022 : ఇంగ్లండ్ తో జరిగే T20I & ODI సిరీస్ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..!!

బర్మింగ్ హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి వరుసగా మ్యచ్ లు జరగనున్నాయి. వారం క్రితమే ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ చేరుకున్న భారత క్రికెటర్లు...ఇప్పటికే లీసెస్టర్ టీంతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడారు.

  • Written By:
  • Publish Date - July 1, 2022 / 12:10 AM IST

బర్మింగ్ హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి వరుసగా మ్యచ్ లు జరగనున్నాయి. వారం క్రితమే ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఇంగ్లాండ్ చేరుకున్న భారత క్రికెటర్లు…ఇప్పటికే లీసెస్టర్ టీంతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడారు. ఇక బర్మింగ్ హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాజ్ జరుగనుంది. గతేడాది జరగాల్సిన ఈ టెస్టు మ్యాచ్ కోవిడ్ కారణంగా వాయిదాపడింది. ఐదు టెస్టుల ఈ సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్తో మూడు టీ20లు మూడు వన్డేలను ఆడనుంది భారత జట్టు.

ఐదో టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్, ODIసిరీస్ కోసం ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును సెలక్ట్ చేసింది.

1st T20I:
రోహిత్ శర్మ (కెప్టెన్) ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణో పటేల్ , భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
2nd T20I:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (wk), రిషబ్ పంత్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
3rd T20I:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర పటేల్, బుమ్రా, చాహల్ , ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జూలై1 నుంచి 5 వరకు బర్మింగ్ హామ్ లో జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడుగంటలకు ప్రారంభం కానుంది.
మూడు టీ20లు…
1. సౌథాంప్టన్ లో జూలై 1న ఫస్ట్ టీ20 మ్యాచ్ ( రాత్రి 10:30గంటలకు ప్రారంభం)
2. బర్మింగ్ హామ్ లో జూలై 9న రెండు టీ20 ( రాత్రి 7 గంటలకు )
3. నాటింగ్ హామ్ లో జూలై 10 మూడో టీ20 ( రాత్రి 7గంటలకు )

మూడు వన్డేలు…
1. కెన్నింగ్ట్ ఓవల్ లో జూలై 12న ఫస్ట్ వన్డే ( సాయంత్రం 5: 30 గంటలకు ప్రారంభం)
2. లార్డ్స్ లో జులై 14న రెండో వన్డే ( సాయంత్రం 5.30లకు )
3. మాంచెస్టర్ లో జులై 17న మూడో వన్డే ( మధ్యాహ్నం 3.30లకు )