world cup 2023: మిచెల్ సెంచరీ.. భారత్ టార్గెట్ 274

ప్రపంచ కప్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 274 పరుగుల టార్గెట్ ను భారత్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ తప్పిదాలు కివీస్ కు బాగా కలిసొచ్చాయి. టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

world cup 2023: ప్రపంచ కప్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 274 పరుగుల టార్గెట్ ను భారత్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో భారత్ ఫీల్డింగ్ తప్పిదాలు కివీస్ కు బాగా కలిసొచ్చాయి. టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది.స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. అతడి స్దానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి రాగా.. శార్థూల్‌ ఠాకూర్‌ స్ధానంలో మహ్మద్‌ షమీ వచ్చాడు. మరోవైపు కివీస్‌ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.

ఆరంభంలో భారత్ బౌలర్లు కివీస్ ను కట్టడి చేశారు. 9 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో డెవాన్‌ కాన్వే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. యంగ్‌ను మహ్మద్‌ షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అయితే రచిన్‌ రవీంద్ర, డార్లీ మిచెల్‌ జట్టును అదుకున్నారు. హాఫ్ సెంచరీలతో కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. రచిన్ రవీంద్ర ఇచ్చిన మూడు క్యాచ్ లను భారత్ ఫీల్డర్లు జారవిడవడం కొంప ముంచింది. చివరికి 75 పరుగులు చేసిన రచిన్‌ రవీంద్ర.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే మిడిలార్డర్‌ బ్యాటర్‌ డార్లీ మిచెల్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సరిగ్గా 100 బంతుల్లో  తన సెంచరీ మార్క్‌ను మిచెల్ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మిచెల్ ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచాడు. చివర్లో భారత పేసర్ షమీ కట్టడి చేయడానికి ప్రయత్నించాడు. చివరికి కివీస్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ 130 రన్స్ కు ఔట్ అయ్యాడు. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు పడగొట్టగా…. కుల్ దీప్ యాదవ్ 2 , బూమ్రా, సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Also Read: Big Warning : ఉత్తర గాజా నుంచి వెళ్లిపోని వాళ్లంతా ఉగ్రవాదులే.. అంతు చూస్తాం : ఇజ్రాయెల్