Site icon HashtagU Telugu

W 0 W 0 W 0 0 W 0 W W : టెస్టుల్లో భారత్ చెత్త రికార్డ్

Sa Vs Ind 2nd Test Six Wick

Sa Vs Ind 2nd Test Six Wick

(SA vs IND ) ప్రత్యర్థిని 55 పరుగులకే ఆలౌట్ చేశారు…బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నిలకడగా ఆడుతూ 4 వికెట్లకు 153 పరుగులు చేశారు..ఇంకేముంది కనీసం 300 స్కోర్ ఖాయమనుకున్న వేళ అనూహ్యంగా కుప్పకూలారు. ఫలితంగా అరుదైన చెత్త రికార్డును టీమిండియా (India Cricket Team ) తమ ఖాతాలో వేసుకుంది. ఒక్క రన్ కూడా చేయకుండా 6 వికెట్లు (Six Wickets for Zero Runs) కోల్పోవడం అంటే ఎవరికైనా షాకే.. ఇటువంటి షాకే కేప్ టౌన్ టెస్టులో భారత్ కు ఎదురైంది. గతంలో మరే జట్టుకు ఇలాంటి పరిస్థితి రాలేదు.

ఓ దశలో 153/4 స్కోర్‌తో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. అనంతరం 11 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోయింది. చివరి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు కనీసం ఖాతా తెరవలేదు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇలా ఒక్క పరుగు కూడా జోడించకుండా చివరి 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి (World Record). కోహ్లీ ఒకవైపు వికెట్లు కాచుకునేందుకు ఒంటరి పోరాటం చేసినా సహచరుల నుంచి మద్ధతు కరువైంది. రాహుల్, జడేజా కూడా అతనికి అండగా నిలవలేకపోయారు. ఇక టెయిలెండర్ల సంగతి సరేసరి. ఇలా వచ్చి అలా వెళ్లారు.. ఫలితంగా 153 పరుగుల దగ్గరే భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

We’re now on WhatsApp. Click to Join.

కేఎల్ రాహుల్ ఒక్కడే ఖతా తెరవగా మిగతా బ్యాటర్లు డకౌటయ్యారు. ఈ పేలవ బ్యాటింగ్‌పై నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. గల్లీ క్రికెటర్ల అయినా కనీసం ఒక్క పరుగైనా చేస్తారని సెటైర్లు పేల్చుతున్నారు. టాయిలెట్ వెళ్లొచ్చే లోపే ఆలౌటయ్యారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ ముగిసినప్పుడు భారత డ్రెస్సింగ్ రూమ్ లో కోచ్ ద్రవిడ్ తో సహా మేనేజ్ మెంట్ కూడా నివ్వెరపోయింది.

Read Also : IND Collapse : కేప్ టౌన్ టెస్టులో వికెట్ల జాతర..భారత్ 153 ఆలౌట్