India Practice: 5 గంటల పాటు నాన్ స్టాప్ ప్రాక్టీస్

టీమిండియా మిషన్ వరల్డ్ కప్ మొదలైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ముగియడంతోనే ఆస్ట్రేలియాలో

Published By: HashtagU Telugu Desk
India Team Imresizer

India Team Imresizer

టీమిండియా మిషన్ వరల్డ్ కప్ మొదలైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ముగియడంతోనే ఆస్ట్రేలియాలో ల్యాండైన రోహిత్ సేన ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. ఈ సారి ప్రపంచకప్ ను అందుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్ లపై సవాల్ ను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. తాజాగా ఐదు గంటల పాటు నాన్ స్టాప్ ప్రాక్టీస్ లో భారత్ చెమటోడ్చింది. బ్యాటింగ్ , బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ శ్రమిస్తోంది. కోచ్ రాహుల్ ద్రావిడ్ ముందే బీసీసీఐతో మాట్లాడి వాకా పిచ్ పై ప్రాక్టీస్ కోసం ప్లాన్ చేశాడు. అలాగే మిగిలిన జట్లతో పోలిస్తే అదనంగా మరో రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.

దీనిలో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుతో రోహిత్ సేన రెండు వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. దీని కంటే ముందు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తోంది. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకూ వాక్ పిచ్ లపై భారత క్రికెటర్లు చెమటోడ్చుతున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల పాటు ఇదే తరహా ట్రైనింగ్ సెషన్స్ ఉండబోతున్నాయి. పెర్త్ స్టేడియంలోనే వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుతో అక్టోబర్ 10న ఒక మ్యాచ్‌, అక్టోబర్ 13న రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ మ్యాచ్‌ అక్టోబర్ 23న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది.

  Last Updated: 08 Oct 2022, 05:21 PM IST