IND vs AUS 2023: మెగాటోర్నీ వన్డే వరల్డ్ కప్ కు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు చిన్నపాటి సన్నాహక వన్డే సిరీస్ ను ఆడనున్నాయి. ఇరు జట్ల మధ్య సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్య మూడు మ్యాచ్ లు జరుగుతాయి. ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ఈ నెల 22న మొహాలీ వేదికగా జరగనుంది. అనంతరం రెండో వన్డే 24న ఇండోర్ లో.. మూడో వన్డే 27న రాజ్ కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లన్నీ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి. కాగా ఈ టోర్నీకి టీమిండియా స్టార్స్ దూరం కానున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు తొలి రెండు వన్డేలకు రెస్ట్ ఇచ్చారు. దీంతో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా, రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఇక మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శర్మ జాయిన్ కాబోతున్నాడు.ఇదిలా ఉండగా ఇరుజట్ల హెడ్ టు హెడ్ రిపోర్ట్ చూస్తే.. ఇప్పటి వరకు 146 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో టీం ఇండియా 54 మ్యాచ్‌లు గెలుపొందగా, ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 5 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.
భారత జట్టు: శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు.
Also Read: F-35 Fighter: అమెరికా F-35 యుద్ధవిమానం ప్రత్యేకతలు