Site icon HashtagU Telugu

Record in Cricket History : భారత్ vs పాక్ మ్యాచ్‌కు 60 కోట్ల వ్యూస్

Jiohotstar Record In Cricke

Jiohotstar Record In Cricke

ఆదివారం జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్ విశేష ప్రేక్షకాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించగా, జియోసినిమా మరియు స్టార్ స్పోర్ట్స్ (JioHotstar) ప్లాట్‌ఫారమ్‌లలో 60.5 కోట్ల వ్యూస్ (Viewership Records) నమోదు అయ్యాయి. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభం సమయంలో 6.8 కోట్ల వ్యూస్ ఉన్నా, విరాట్ కోహ్లీ (Virat Kohli 51 ODI century) తన అద్భుతమైన సెంచరీ పూర్తి చేసి భారత్‌ను విజయపథంలో నడిపేసరికి ఈ సంఖ్య 60 కోట్ల మార్క్ దాటింది. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌కు ఇంతటి వ్యూస్ రాలేదని విశ్లేషకులు తెలిపారు.

Virat Kohli: వ‌న్డేల్లో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 14 వేల ప‌రుగులు పూర్తి!

పాక్ స్పెషల్ కోచ్ వ్యూహం విఫలం – భారత్ విజృంభణ

భారత్‌ను ఓడించేందుకు పాకిస్థాన్ జట్టు ప్రత్యేక వ్యూహాలను రచించుకుంది. రెగ్యులర్ కోచ్ అకిబ్ జావేద్‌ను పక్కన పెట్టి, మాజీ క్రికెటర్ ముదస్సర్ నాజర్‌ను స్పెషల్ కోచ్‌గా నియమించుకుంది. అయితే మ్యాచ్‌లో వారి వ్యూహాలు విఫలమయ్యాయి. సాధారణంగా పేస్ బౌలింగ్ దళంతో బలంగా కనిపించే పాకిస్థాన్ జట్టు, భారత బ్యాటింగ్ ధాటికి తట్టుకోలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ పాక్ తేలిపోయింది. ఈ ఓటమి తర్వాత క్రికెట్ విశ్లేషకులు పాక్ జట్టు ప్రణాళికలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Liquor Brands : కొత్త బ్రాండ్లు వచ్చేస్తున్నాయి..మందుబాబులకు కిక్కే కిక్కు

విజయోత్సాహంలో భారత క్రికెట్ జట్టు – ప్రముఖుల శుభాకాంక్షలు

భారత్ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రీజులో ఎక్కువ సమయం గడపాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సహచర ఆటగాళ్లను కొనియాడుతూ, గిల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడని ప్రశంసించారు. భారత జట్టు విజయంపై రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, లోకేశ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయాన్ని అభిమానులు కూడా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.