Site icon HashtagU Telugu

India-Pak: భారత్, పాక్ మ్యాచ్ యాషెస్ సీరీస్ లాంటిది: టామ్ మూడీ రియాక్షన్

ICC Visit Pakistan

ICC Visit Pakistan

మన దేశంలో సినిమాలు ఎంత ఫేమస్సో, అంతకంటే క్రికెట్ ఫేమస్. టీమిండియా ఏదైనా సిరీస్ లోకి దిగుతుందంటే కోట్లాది అభిమానులు టీవీలకు అత్కుకుపోతారు. ముఖ్యంగా పాక్, ఇండియా మ్యాచ్ అయితే సెలవు పెట్టి ఆటను ఆస్వాదిస్తారు. మ్యాచ్ టికెట్ల కోసం పోటీ పడతారు. ముందే హోట్సల్ బుక్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ సమీపిస్తుండటంతో ఇలాంటి ద్రుశ్యాలే కనిపించబోతున్నాయి. భారత అభిమానులు ఆసియా కప్ లో పాక్, ఇండియా మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.

2023 ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరుగబోయే మ్యాచ్ ఇప్పట్నుంచే ఉత్కంఠత రేపుతుంది. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సన్నాహాలపై గురించి మాట్లాడారు. ఆయన ఇండో-పాక్ మ్యాచ్ ను యాషెస్ సిరీస్‌తో పోల్చాడు రెండు జట్ల బలాలు మరియు బలహీనతల గురించి చర్చించాడు.

“ఈ మ్యాచ్ యాషెస్‌ను మరిపిస్తుందని నేను భావిస్తున్నాను. రెండు జట్లు బలమైనవే. పాకిస్తాన్ జట్టును చూస్తే చాలా ప్రతిభను చాటుతుంది. అనుభవాన్ని కూడా కలిగి ఉంది. తమ పేస్ బౌలింగ్‌తో ఇండియాను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. పాక్ ఆర్డర్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ అజామ్ వంటి వారిపై ఒత్తిడి  ఉంటుంది అని ఆయన అన్నారు. ఇక  పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ అఫ్రిది కీలక పాత్రను వహించే అవకాశాలున్నాయన్నారు. ఇక భారత్ కూడా చెలరేగె అవకాశాలున్నాయని అన్నారు. విరాట్, రోహిత్ మంచి ప్రతిభ చాటితే పాక్ కు కష్టాలు తప్పవని అన్నారు. అయితే ఆయన భారత్ బౌలింగ్ మరింత మెరుగు కావాల్సి ఉందన్నారు.

Also Read: BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?