Site icon HashtagU Telugu

Mohammed Siraj Unleashed : బంతులా…బుల్లెట్లా…కేప్ టౌన్ రాజ్ సిరాజ్

Mohd Siraj

Mohd Siraj

సౌతాఫ్రికా (South Africa) పర్యటనలో తొలి టెస్టు (Test Match) ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తర్వాత టీమిండియా (Team India) పుంజుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. సఫారీ పేసర్లు చెలరేగిపోయిన సెంచూరియన్ పిచ్ పై మన బౌలర్లు తేలిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకున్న భారత పేసర్లు కేప్ టౌన్ టెస్ట్ తొలిరోజు అదరగొట్టేశారు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj ) బుల్లెట్స్ లాంటి బంతులతో రెచ్చిపోయాడు. సిరాజ్ ఈ సిరీస్ లో తొలిసారి పూర్తి స్థాయి పేస్ తో చెలరేగిపోయాడు. నిజానికి తొలి టెస్టులో పిచ్ నుంచి సపోర్ట్ దక్కినా మన బౌలర్లు సద్వినియోగం చేసుకోకపోవడం ఓటమికి కారణమైంది. అయితే కేప్ డౌన్ పిచ్ ను బాగా అర్థం చేసుకున్న సిరాజ్ సఫారీ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించాడు.

We’re now on WhatsApp. Click to Join.

సిరాజ్ దెబ్బకు సఫారీ బ్యాటర్లు క్రీజులోకి రావడం, పెవిలియన్‌కు చేరేడం.. ఇదే రిపీట్ అయ్యింది. సౌతాఫ్రికా స్కోరు 50 దాటితే స్టేడియంలో సఫారీసేన అభిమానులంతా సంతోషంతో చప్పట్లు కొట్టారంటే భారత్ పేసర్ల జోరు అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సిరాజ్ రికార్డు సృష్టించాడు. తొలి రోజు ఆటలో లంచ్ విరామంలోపు అయిదు వికెట్లు తీసిన భారత రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

సిరాజ్ కంటే ముందు 1987లో భారత్ తరపున మణిందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మణిందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో సిరాజ్ చేరాడు. మరోవైపు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. 2015లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికాను భారత్ 79 పరుగులకు ఆలౌట్ చేయడం అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు అంతకంటే తక్కువ స్కోరుకు సఫారీలను ఆలౌట్ చేసింది.

Read Also : Guntur Kaaram Trailer : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & ట్రైలర్ రిలీజ్ ఫిక్స్