India Pacer: భారత్- ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. మొదటి మ్యాచ్ హెడింగ్లీలో ఆడారు. ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుని, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మొదటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత జట్టులో పెద్ద మార్పు జరిగింది. జట్టు స్టార్ ఆటగాడిని (India Pacer) స్క్వాడ్ నుండి తొలగించారు.
స్టార్ బౌలర్ బయటకు
భారత స్క్వాడ్ నుండి హర్షిత్ రాణాను తొలగించారు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు హర్షిత్ రాణా పేరు జట్టులో లేదు. కానీ, లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందు హర్షిత్‌ను స్క్వాడ్‌లో చేర్చారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హర్షిత్‌ను ఇప్పుడు భారత జట్టు నుండి తొలగించారు. మొదటి మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడినప్పటికీ.. బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. జస్‌ప్రీత్ బుమ్రాను మినహాయిస్తే ఏ బౌలర్ కూడా మంచి బౌలింగ్ చేయలేదు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ ఖరీదైన బౌలర్లుగా నిరూపించబడ్డారు.
Also Read: Bonalu Festival: బోనాల వేడుకలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఇటీవలి ప్రదర్శన ఇలా ఉంది
హర్షిత్ రాణా ఇటీవలి ప్రదర్శన అంత బాగోలేదు. ఇంగ్లాండ్ లయన్స్‌తో ఇండియా A తరపున ఆడుతూ రాణా దారుణంగా బౌలింగ్ చేశాడు. అతను 27 ఓవర్లలో 99 పరుగులు ఖర్చు చేసి 1 వికెట్ మాత్రమే తీశాడు. భారత్ తరపున ఇప్పటివరకు ఆడిన 2 టెస్ట్ మ్యాచ్‌లలో హర్షిత్ 4 వికెట్లు, 5 వన్డేలలో 10 వికెట్లు, 1 టీ-20 మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. చివరిగా అతను 2025 చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో భారత్ తరపున ఆడాడు.
భారత జట్టు స్క్వాడ్
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.