Site icon HashtagU Telugu

IND vs ENG: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత్ మొదటికే

IND vs ENG

IND vs ENG

IND vs ENG: ఒక్క టెస్ట్ సిరీస్ తో టీమిండియా విధ్వంసం బయటపడింది. కుర్రాళ్ళ సెంచరీల మోతకు ర్యాంకులన్నీ దాసోహమయ్యాయి. సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో ఓడిన రోహిత్ సేన మిగతా రెండు మ్యాచులో ఇంగ్లాండ్ జట్టును మట్టి కురిపించింది. ముఖ్యంగా మూడో టెస్టులో భారీ స్కోరుతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా ర్యాంక్ మళ్ళీ మొదటికి వచ్చేలా కన్పిస్తుంది.

నెక్స్ట్ ప్రకటించబోయే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకోవడం ఖాయమైంది. దీంతో మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా అవతరించనుంది. నిజానికి వన్డే, టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా ఇప్పటికే నంబర్‌వన్‌లో ఉంది. ఇప్పుడు టెస్టుల్లోనూ నంబర్-1గా అవతరించబోతుంది. గతేడాది ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానంలో కొనసాగింది. అప్పుడు కూడా మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోవడంతో టీమిండియా 115 రేటింగ్ తో అగ్రస్థానంలో నిలిచింది.

కాగా ఈ జనవరి 28న ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లను ప్రకటించింది. టీమిండియా రెండవ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా తొలి స్థానం దక్కించుకుంది. ఆస్ట్రేలియా 117 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటె భారత్ కూడా 117 పాయింట్లతో సమానంగా నిలిచింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. ఈ పరిస్థితిలో రోహిత్ ఆస్ట్రేలియాను అధిగమించడం ఖాయం. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్, ఆస్ట్రేలియాలు సమాన రేటింగ్ పాయింట్లను కలిగి ఉన్నాయి. ఇంగ్లండ్ 115 రేటింగ్‌తో మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 106 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ 95 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రకటించబోయే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు జరగనున్నాయి.

Also Read: Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?