Ind Vs Aus: మళ్లీ తిప్పేసారు.. ఢిల్లీ టెస్టులో భారత్ టార్గెట్ 115

సొంత గడ్డపై భారత స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ కంటే మరింతగా బంతిని తిప్పేయడంతో రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టీమిండియా మరో విజయంపై కన్నేసింది.

  • Written By:
  • Updated On - February 19, 2023 / 11:33 AM IST

సొంత గడ్డపై భారత స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ కంటే మరింతగా బంతిని తిప్పేయడంతో రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టీమిండియా మరో విజయంపై కన్నేసింది. నిన్న చివరి సెషన్ లో దూకుడుగా ఆడిన ఆసీస్ కు మన స్పిన్నర్లు ఇవాళ కళ్లెం వేశారు. తొలి సెషన్ ఆరంభం నుంచే వారిని కంగారెత్తించారు.

జడేజా , అశ్విన్ చెరొక ఎండ్ నుంచీ చెలరేగిపోవడంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ కోలుకోలేక పోయింది. ఫలితంగా కంగారూ టీమ్ రెండో ఇన్నింగ్స్ లో 113 రన్స్ కే కుప్పకూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు.

Also Read: Illegally Entered India: 16 మంది చొరబాటుదారులు అరెస్ట్.. 12 మంది విదేశీ పౌరులు

ఈ సీరీస్ లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా 7 వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 రన్స్ చేయగా…భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం సాధించింది. తాజాగా రెండో టెస్టులోనూ అదరగొట్టి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు మరింత చేరువైంది.