CWG Hockey: సెమీస్ లో భారత్ పురుషుల హాకీ జట్టు…అథ్లెటిక్స్ లో మెడల్ ఆశలు

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కూడా దూసుకెళుతోంది. ఫామ్ లో ఉన్న టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది.

  • Written By:
  • Updated On - August 5, 2022 / 10:20 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు కూడా దూసుకెళుతోంది. ఫామ్ లో ఉన్న టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో గెలుపొందింది.  హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి భారత జట్టుకి 3-0 ఆధిక్యం అందించగా, నాలుగో క్వార్టర్‌లో గుర్జత్ సింగ్ గోల్ సాధించి ఆ ఆధిక్యాన్ని 4-0కి పెంచాడు. ఆఖర్లో వేల్స్ ఓ గోల్ సాధించినా 4-1 తేడాతో ఫలితం లేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ లో అద్భుతంగా రాణించిన భారత హాకీ టీమ్ తర్వాత పలు టోర్నీల్లో పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే ఒలింపిక్స్ తర్వాత అతి పెద్ద క్రీడా వేదికపై మాత్రం నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుతం గ్రూప్ స్టేజీలో మూడు విజయాలు, ఓ డ్రాతో టేబుల్ టాపర్‌గా భారత్ సెమీస్ లో అడుగు పెట్టింది.
ఇదిలా ఉంటే అథ్లెట్లు కూడా అంచనాలకు మించి రాణిస్తున్నారు.హ్యామర్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ మంజు బాల 59.68 మీటర్లు విసిరి ఫైనల్‌కి అర్హత సాధించింది. భారీ అంచనాలతో కామన్వెల్త్‌లో బరిలో దిగిన భారత స్ప్రింటర్ హిమా దాస్, 200 మీటర్ల క్వార్టర్ ఫైనల్‌లో టాపర్‌గా నిలిచి సెమీస్‌కి అర్హత సాధించింది. 200 మీటర్లను 23.42 సెకన్లలో ముగించిన హిమా దాస్, ఓవరాల్‌గా 8వ స్థానంలో నిలిచింది.
అటు బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ల పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ప్రీ-క్వార్టర్స్‌కి దూసుకెళ్లారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి అశ్విని పొన్నప్ప- సుమీత్ రెడ్డి రెండో రౌండ్‌లో ఇంగ్లాండ్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది.